![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -70 లో.. హాస్పిటల్ ఉన్న వీరు తమ్ముడిని ఓ సీసీటీవీ ఏర్పాటు చేసి రుద్ర గమనిస్తుంటాడు. అయితే వాళ్ళ తమ్ముడిని రుద్ర కొడతాడు. ఆ విషయం వీరుకి రౌడీలు ఫోన్ చేసి చెప్తారు. అతను కోమాలో నుండి బయటకి రావచ్చని డాక్టర్ ఆ రౌడీలకి చెప్తాడు. తమ్ముడు కోమాలో నుండి బయటకి వస్తాడంట, డాక్టర్ నిన్ను రమ్మన్నారని వీరూతో రౌడీలు చెప్పగానే అతను బయల్దేరి వస్తాడు.
మరోవైపు పెద్దసారుని స్టోర్ రూమ్ తాళం అడిగి తీసుకుంటుంది గంగ. అందులో బూజు కర్ర ఉందని పెద్దసారుకి చెప్తుంది. అయితే గంగ మాత్రం రుద్ర ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని స్టోర్ రూమ్ కి వెళ్తుంది. మరోవైపు హాస్పిటల్ లో సీసీటీవీలు ఫిక్స్ చేసి రుద్ర అసలు సూత్రధారి కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో వీరు వస్తాడు. అతడి తమ్ముడి దగ్గరున్న ఇద్దరు రౌడీలని కొడతాడు. దాంతో వాళ్ళు జరిగిందంతా చెప్తారు. నా తమ్ముడిని ఆ రుద్ర కొడతాడా.. వాడిని అంత ఈజీగా వదిలిపెట్టనని చెప్తాడు. అప్పుడే డాక్టర్ వచ్చి త్వరలో మీ తమ్ముడు కోలుకుంటాడని చెప్తాడు.
ఇక గదిలో నుండి వీరు బయటకి రాగానే ఎదురుగా రుద్ర ఉంటాడు. అతడిని చూసి వీరు షాక్ అవుతాడు. ఏంటి బావ మీరు ఇక్కడ అని ఏమీ తెలియనట్లుగా రుద్రని వీరూ అడుగుతాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఏదో కవర్ చేయాలని చూస్తాడు వీరు. నువ్వు హాస్పిటల్ కి వచ్చింది.. అ రౌడీలని కొట్టింది అంతా చూసానని రుద్ర అంటాడు. దాంతో వీరు షాక్ అవుతాడు. ఇక వీరూ ఏదో కవర్ చేస్తాడు. ఇంతలో ఒకడు బ్లాక్ డ్రెస్ వేసుకొని మాస్క్ తో వీరు తమ్ముడి గది దగ్గరికి వస్తాడు. అతడిని చూసి వాడే అసలు సూత్రధారి అనుకొని రుద్ర వెంబడిస్తాడు. కానీ వాడు తప్పించుకుంటాడు. ఇక వీరు వాడికి కాల్ చేసి, గుడ్ జాబ్ టైమ్ కి వచ్చావ్.. అక్కడి నుండి వెళ్ళిపో.. డబ్బులు పంపిస్తానని చెప్తాడు. హాస్పిటల్ బయట రుద్ర కార్ చూసిన వీరు.. డైవర్ట్ చేయడానికి అలా ఒక మనిషిని సెట్ చేస్తాడన్న మాట.
మరోవైపు గంగకి స్టోర్ రూమ్ లో ఓ ఫోటో ఆల్బమ్ దొరుకుతుంది. ఇక అప్పుడే రుద్ర ఇంటికి రావడంతో.. గంగ కంగారుగా ఆ ఆల్బమ్ తీసుకొని వస్తుంది. ఇంతలో రుద్రని ఢీకొడుతుంది గంగ. ఇక తనని డైవర్ట్ చేసి ఆ ఆల్బమ్ తీసుకొని వెళ్తుంది గంగ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |